Sri Naradapuranam-3    Chapters    Last Page

ఏకసప్తతి తమో%ధ్యాయః డెబ్బది యొకటవ అధ్యాయము పుష్కరమాహాత్మ్యము

మోహిన్యువాచ :-

శ్రుతం ప్రభాస మాహాత్మ్యం ద్విజశ్రేష్ఠాతి పుణ్యదమ్‌ | అధునా శ్రోతుమిచ్ఛామి మాహాత్మ్యము పుష్రకోద్భవమ్‌ 1
యదాద్యం సర్వతీర్థానాం పవిత్రం పాపనాశనమ్‌ | మత్పితుర్య జ్ఞ సదనం తన్మమాఖ్యాహి విస్తరాత్‌ 2
మోహిని పలికెను :-
ఓ బ్రాహ్మణోత్తమా ! అతి పుణ్య ప్రదమగు ప్రభాస మాహాత్మ్యమును వింటిని. ఇపుడు పుష్కర మాహాత్మ్యమును వినగోరుచున్నానను. పుష్కరము సర్వతీర్థములకు ఆదితీర్థము. పరమ పవిత్రము పాపనాశనము. నాతండ్రియగు బ్రహ్మకు యజ్ఞభూమి. అట్టి పుష్కరమాహాత్మ్యమును విస్తరముగా చెప్పుము.
వసురువాచ :-
శృణు భ##ద్రే ప్రవక్ష్యామి నరాణాం కామదం సదా | పుణ్యం పుష్కర మాహాత్మ్యం బహు తీర్థ సమన్వితమ్‌ 3
విష్ణునా సహితా దేవాయత్రేన్ద్రాద్యా వ్యవస్థితా | గజవక్త్రః కుమారశ్చ రైవతశ్చ దివాకరః 4
శివదూతీ యధాదేవీ క్షేత్ర క్షేమం కరీ సదా | జ్యేష్ఠేతు పుష్కరారణ్య యస్తిష్ఠతి నిరుద్యమీ 5
అష్టాంగ యోగజం పుణ్యం స లభేన్నాత్ర సంశయః | నాతః పరతరం కించిత్‌ క్షేత్ర మస్తీహ భూతలే 6
తస్మాత్సర్వ ప్రయత్నేన సేవ్యమేతన్నరోత్తమైః | బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శూద్రా వా క్షేత్ర వాసినః 7
సర్వాత్మనా బ్రహ్మభక్తా భూతానుగ్రహకారిణాః | తే యాన్తి బ్రహ్మణో లోకం యత్ర గచ్ఛంతి యోగినః 8
యో నర స్సర్వ తీర్థేషు యత్ఫలం లభ##తే ప్లుతః | తత్సర్వం స లభేన్మర్త్యో జ్యేష్ఠకుండే సకృత్థ్సుతః 9
పుష్కరారణ్యమాసాద్య యత్ర ప్రాచీ సరస్వతీ | మతిస్మృతిర్దయా ప్రజ్ఞా మేధా బుద్ధి సమాహ్వయా 10

తత్రస్థం తజ్జలం యే
%పి ప్రపశ్యన్తి తటే స్థితాః | తేకప్యశ్వమేధయజ్ఞస్య ఫలం ప్రాప్య వ్రజన్తి కమ్‌ 11
త్రీణీ శృంగాణి శుభ్రాణి త్రీణి ప్రస్రవణానిచ | జ్యేష్ఠం మధ్య కనిష్ఠాని త్రీణి తత్ర సరాంసి చ 12
తత్రాన్యత్సు మహాత్తీర్థం నందా నామ సరస్వతీ | యత్ర పశ్చిమదిశ్యాస్తే సరసో యోజనే సతి 13
తత్ర స్నాత్వా విధానేన గాం చదత్వా పయస్వినీమ్‌ | విప్రాయ వేదవిదుషే వ్రజేద్ర్బహ్మాక్షయం నరః 14
కోటితీర్థం తధాత్రాస్తి యత్రర్షికోటి రాగతా | తత్ర స్నాత్వా ద్విజాన్ప్రార్చ్య ముచ్యతే సర్వపాతకైః 15
అగస్త్యాశ్రమమాసాద్య స్నాత్వా సంపూజ్య కుంభజమ్‌ | దీర్ఘాయుర్జాయతే భోగే దేహాంతే స్వర్గతిం లభ##తే 16
సప్తార్షీణాం తథాప్రాప్య తత్రాశ్రమ మనన్యధీః | స్నాత్వా సంపూజ్య భక్త్యా తల్లభ##తే తత్సలోకతామ్‌ 17
మనూనా మాశ్రమే స్నాత్వా పూజా మాప్నోతి సర్వతః | గంగా వినిర్గమే స్నాత్వా గంగాస్నాఫలం లభేత్‌ 18
జ్యేష్ఠేతు పుష్కరేస్నాత్వా గాం చ దత్వా ద్విజాతయే | భుక్త్వేహ భోగానఖిలా న్ర్బహ్మలోకే మహీయతే 19
మధ్యమే పుష్కరే స్నాత్వా బ్రాహ్మణాయ మహీం దదన్‌ | విష్ణులోక మవాప్నోతి విమాన వరమాస్థితః 20
కనిష్ఠేతు నరస్స్నాత్వా దత్త్వా విప్రాయ కాంచనమ్‌ | సర్వాన్కామానవాప్యాంతే రుద్రలోకే మహీయతే 21
తతో విష్ణుపదే స్నాత్వా దత్త్వా కించిద్ద్విజాతయే | లభ##తే సకలాన్కామాన్‌ విషోశ్చైవ ప్రసాదతః 22
నాగతీర్థే తతస్నాత్వా నాగాన భ్యర్చ్య మానవాః | దత్త్వా దానం ద్విజాతిభ్యః మోదతే త్రిదివే యుగమ్‌ 23
పిశాచతీర్థకే స్నాత్వా దత్త్వా విప్రాయ భోజనమ్‌ | న కదాచిత్పిశాచత్వం ప్రాప్నోతి త్రిదివం వ్రజేత్‌ 24
శివదూతీహ్రదే స్నాత్వా తత్ర శంభుం సమర్చ్య చ | విప్రాన్సంభోజ్య మిష్టాన్నం స్వర్గలోకే మహీయతే 25
ఆకాశపుష్కరే స్నాత్వా మంత్రయోగ ఫలప్రదే | నరో ముక్తి మవాప్నోతి సత్యం సత్యం తవోదితమ్‌ 26
వసువు పలికెను :-
శుభకరురాలా ! మానవులకు అభీష్ఠప్రదము బహుతీర్థ సమన్వితమగు పుణ్యప్రదమగు పుష్కరమాహాత్మ్యమును చెప్పెదను వినుము. పుష్కర తీర్థమున విష్ణు సహితులగు ఇన్ద్రాదిదేవతలు గణపతి కుమార స్వామి ఉందురు. రైవతుడు దివాకరుడు కూడా ఉందురు. ఇచట శివదూతి యను దేవి ఈ క్షేత్రమునకు క్షేమమును కలిగించు చుండును. జ్యేష్ఠ మాసమున పుష్కరారణ్యమున నుండు వానికి అష్టాంగ యోగ పుణ్యము లభించును. ఈ భూమండలమున ఇంతకంటే ఉత్తమమగు క్షేత్రము మరియొకటి లేదు. కావున సర్వప్రయత్నములలో ఈ క్షేత్రమును సేవించవలయును. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు ఎవరైనను క్షేత్రవాసులైన చో బ్రహ్మభక్తులు సకలప్రాణులను అనుగ్రహించు వారు అగుదురు. వీరు యోగులు వెళ్ళు బ్రహ్మలోకమునకు వెళ్ళెదరు. ఒకసారి జ్యేష్ఠ కుండమున స్నానమాడిన వారు సర్వతీర్థస్నాన ఫలమును పొందును. పుష్కరారణ్యమును చేరి అచటనున్న ప్రాచీ సరస్వతిని మతి స్మృతి దయాప్రజ్ఞా మేధా బుద్ధి అను పేర్లుకల తీర్థోధకమును దర్శించుచు తీరమున ఉన్నవారు అశ్వమేధ యజ్ఞ ఫలమును పొంది స్వర్గమును చేరెదరు. ఇచట మూడు శృంగములు, మూడు ప్రస్రవణములు జ్యేష్ఠమధ్య కనిష్ఠములీను మూడు సరస్సులు కలవు. ఇచటనే నందాయను పేరుగల సరస్వతీ తీర్థము కలదు. మొదటి సరస్సునకు పశ్చిమ భాగమున ఒక యోజన దూరము కలదు. ఈ తీర్థమున స్నానమాడి పాలిచ్చు గోవును వేద విదుడగు బ్రాహ్మణునకు దానము చేసిన వారు అక్షయమగు బ్రహ్మలోకమును చేరెదరు. ఋషి సమూహము నివసించు కోటి తీర్థము ఇచటనే యున్నది. ఇచట స్నానమాడి బ్రాహ్మణులను పూజించిన వారు సర్వపాతక వినిర్ముక్తులగుదురు. ఇచటనే యున్న అగస్త్యా శ్రమమును చేరి అగస్త్య మహర్షిని పూజించి దీర్ఘాయుష్మంతుడు భోగి అయి దేహాంతమున స్వర్గమును పొందును. ఇచటనే యున్న సప్తర్షి ఆశ్రమమును చేరి స్నానమాడి భక్తిచే సప్తర్షులను పూజించిన వారు సప్తర్షిలోకమును చేరెదరు. మన్వాశ్రమమున స్నానమాడిన వారు అంతట పూజలను పొందెదరు. గంగా వినిర్గమమున స్నానమాడి బ్రాహ్మణునకు గోదానమునిచ్చిన వారు ఇహమున అఖిల భోగములననుభవించి బ్రహ్మలోకమున నివసించును. మధ్యమ పుష్కరమున స్నానమాడి బ్రాహ్మణమునకు భూదానము గావించ వలయును. ఇట్లు చేసిన విమానశ్రేష్ఠము నధిరోహించి విష్ణులోకమును చేరును. కనిష్ఠ పుష్కరిణిలో స్నానమాడి బ్రాహ్మణునకు కాంచన దానము చేసిన ఇహమున సర్వకామనలను పొంది అంతమున రుద్రలోకము చేరును. తరువాత విష్ణు పదమున స్నానము చేసి బ్రాహ్మణునకు ఏదేని దానము చేసిన శ్రీవిష్ణు, అనుగ్రహమువలన సకల కామనలను పొందును. తరువాత నాగతీర్థమున స్నానమాడి నాగులను పూజించి బ్రాహ్మణులకు దానము చేసిన స్వర్గమును యుగకాలము ఆనందించును. పిశాచ తీర్థమున స్నానము చేసి బ్రాహ్మణుని భుజింప చేసి పిశాచత్వమునకు దూరమై స్వర్గమును చేరును. శివదూతీ హ్రదమున స్నానము చేసి అచట శివుని పూజించి బ్రాహ్మణులను మిష్టాన్నము భుజింప చేసి స్వర్గలోకమున విరాజిల్లును. ఆకాశ పుష్కరమున స్నానమాడి నరుడు మోక్షమును చేరును.
ఆపోహిష్ఠాది భిర్మంత్రై రాకాశస్థం విచిన్త్య తత్‌ | స్నాయాద్యః పుష్కరారణ్య స లభేచ్ఛాశ్వతం పదమ్‌ 27
ఆగ్నేయం తు యదా ఋక్షం కార్తిక్యాం భవతి క్వచిత్‌ | మహాతీ సా తిధిస్తత్ర స్నానమాకాశపుష్కరే 28
యామ్యర్‌ క్షయోగే కార్తిక్యాం మధ్యమే స్నానకృన్నరః | తత్ఫలం సమవాప్నోతి యన్నభః పుష్కరోద్భవమ్‌ 29
ప్రాజాపత్యర్‌క్ష యుక్తాయాం కార్తిక్యాం తు కనిష్ఠకే | స్నాతస్తత్ఫల మాప్నోతి యద్వియత్పుష్కరోద్భవమ్‌ 30
నందా చార్కే గురౌ సోమే యామ్యే వహ్నౌ విధౌ క్రమాత్‌ | యదా సభః పుష్కరోత్థం తదాస్యాత్యకలం ఫలమ్‌ 31
విశాఖాయాం యదా భానుః కృత్తికాయాంచ చన్త్రమాః | తదా నభః పుష్కరాఖ్యే యోగే స్నాతో దివం వ్రజేత్‌ 32

అంతరిక్షావతీర్థే
%స్మి స్తీర్దే పైతామహే శుభే | కుర్వన్తి యే నరా స్స్నానం తేషాం లోకా మహోదయాః 33
పంచ స్రోతస్సరస్వత్యాం పుష్కరారణ్యకే సతి | కృతాని మునిభిస్సిద్ధే స్తీర్థాన్యాయతనానిచ 34
తేషు సర్వేషు విజ్ఞేయా ధర్మహేతు సరస్వతీ | హాటకక్షితి గౌరీణాం దానం తేషు మహాఫలమ్‌ 35

ధాన్యాన్యపి తిలాంశ్చాపి యో
త్ర దద్యాద్ద్విజోత్తమే | స నరో లభ##తే భోగా నిహాముత్ర పరాం గతిమ్‌ 36
సంగే గంగా సరస్వత్యో ర్యస్స్నాత్వా పూజయేద్ద్విజాన్‌ | స ప్రాప్నోతి గతిం చాగ్ర్యాం భుక్త్యాభోగానిహేప్సితాన్‌ 37
అవియోగాభిధాయాం తు వాప్యాం స్నాత్వా సరస్వతి | పిండం దత్వా విధానేన పితౄన్నయతి వై దివమ్‌ 38
తధాసౌ భాగ్యకూపేతు స్నాత్వా సంతర్స్య పూర్వజాన్‌ | సద్గతిం లభ##తే మర్త్యో సౌభాగ్యం చాతులం నరః 39
మర్యాదాపర్వతౌ ద్వౌతు స్నాత్వా స్పృష్ట్వా సమర్చ్య చ | వాంఛితాం ల్లభ##తే లోకాన్‌ సాంగయాత్రా ఫలం తదా 40
లాజగంధం శివం ప్రాప్య సమభ్యర్చ్య విధానతః | లభ##తే వాంఛితాన్కామా నిహలోకే పరత్ర చ 41
సరసో దక్షిణ భాగే సావిత్రీం పర్వతోపరి | సంస్థితాం యస్సమభ్యర్చే త్సోపి వేదస్య తత్త్వవిత్‌ 42
వారాహస్య నృసింహస్య బ్రహ్మణశ్చ హరేస్తథా | శివస్యచాపి సూర్యస్య సోమస్య చ గుహస్య చ 43
పార్వత్యా స్వనలస్యాపి తత్ర తీర్థాని మోహిని | పృధక్తేషు మహాభాగే నరస్స్నాత్వా సమాహితః 44
దానం చ దత్వా విప్రేభ్యో లభ##తే గతి ముత్తమామ్‌ | పుష్కరే దుర్లభం స్నానం పుష్కరే దుర్లభం తపః 45
పుష్కరే దుర్లభం దానం పుష్కరే దుర్లభా స్థితిః | శతయోజన సంస్థోపి స్నానకాలే తు యో నరః 46
పుష్కరం చింతయేద్భక్త్యా సతత్స్నానఫలం లభేత్‌ | మంకణాద్యాస్తపస్సిద్ధా సేవన్తే పుష్కరం ముదా 47
యత్ర యత్ర గతో భాగ్యా త్కామితాం సిద్ధి మాప్నుయాత్‌ | పుష్కరేతి చ నామాపి యేనోక్తం విధి నందిని 48

పుష్కర స్నానజం పుణ్యం లభేత్సో
%పి న సంశయః | యశ్శృణోతి నరో భక్త్వా మహాత్మ్యం పుష్కరస్య చ 49
సో
%పి స్నాన ఫలం ప్రాప్య మోదతే దివి దేవత్‌ 50
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున
వసుమోహినీ సంవాదమున పుష్కర మాహాత్మ్యమను
ఏకసప్తతి తమోధ్యాయము
ఆకాశస్థుతిని ధ్యానము చేయుచు అపోహిష్ఠాది మంత్రములచే పుష్కరారణ్యమున స్నానమాడిన వారు శాశ్వతతపదమును చేరును. కార్తిక మాసమున పూర్ణిమనాడు కృత్తికానక్షత్రమున వచ్చిన మహాతిథియనబడును. ఆనాడు ఆకాశపుష్కరమున స్నానము విశేష ఫలప్రదము. కార్తిక పూర్ణిమనాడు భరణీ నక్షత్రము వచ్చినచో మధ్యమ పుష్కరిణిలో స్నానమాడిన వారు ఆకాశ పుష్కర ఫలము లభించును. కార్తిక పూర్ణిమనాడు
రోహిణీ నక్షత్రము వచ్చినచో కనిష్ఠ సరస్సున స్నామాడిన ఆకాశ పుష్కర స్నాన ఫలము కలుగును. సూర్యగురు సమాగమమున చంద్రశని సమాగమమున కుజచంద్రయోగమున ఆకావపుష్కర స్నానుమ సకల ఫల ప్రదము. విశాఖా నతక్ష్రతమున సూర్యుడు, కృత్తికా నక్షత్రమున చంద్రుడున్నపుడు ఆకాశ పుష్కరిణిలో స్నామాడినచో స్వర్గమును చేరును. అంతరిక్షమునుండి అవతరించిన ఈ బ్రహ్మ పుష్కరిణిలో స్నామాడిన వారికి సనాతన లోకములు కలుగును. పుష్కరారణ్యమునగల సరస్వతీ నదిలో పంచ సరస్సులు మునులచే ఏర్పరచబడినవి. ఇట్లే దేవతాయతనములు కూడా ఏర్పడినవి. వీటన్నిటిలో సరస్వతి ధర్మహేతువని తెలియుము. ఇచట స్వర్ణ భూ గోదానములు మహా ఫల ప్రదములు. ఇ చట ధాన్యమును కాని తిలలను కాని బ్రాహ్మణునకు దానము గావించిన ఇహ లోకమున సకల భోగములననుభవించి అంతమున ఉత్తమ గతి లభించును. గంగా సరస్వతీ సంగమమున స్నానమాడి బ్రాహ్మణులను పూజించిన వారు ఇహమున ఈప్సిత భోగములననుభవించి పరమమున ఉత్త గతిని పొందును. అవియోగాభిధా వాపియందు స్నానమాడి పూర్వజులకు తర్పణము గావించి అతులసౌభాగ్యమును పొంది అంతమున సద్గతిని పొందును. మర్యాదా పర్వతమున స్నానమాడి స్పృశించి పూజించిన వాంఛి తార్థములను సంపూర్ణయాత్రా ఫలమును పొందును. అజగంధ శివుని చేరి యధావిధిగా పూజించి ఇహమున వాంఛితార్థములను పొంది పరమున సద్గగతిని పొందును. సరోదక్షిణ భాగమున పర్వతోపరితలమున నున్న సావిత్రిని పూజించిన వాడు వేదవిదుడగును. ఇచట వరాహస్వామి, నృసింహస్వామి, బ్రహ్మ, శ్రీహరి, శివ, సూర్య, చంద్ర, గుహ పార్వతీ, అగ్ని తీర్థములు కలవు. వీటి యందు విడివిడిగా స్నానమాడి విప్రులకు దానములనిచ్చి ఉత్త గతిని పొందెదరు. పుష్కర స్నానము దుర్లభము. పుష్కరమున తపము దుర్లభము. పుష్కరమున దానము దుర్లభము. పుష్కర నివాసము దుర్లభము. శతయోజన దూరమున ఉన్న వారు కూడా స్నాన కాలమున పుష్కరమున స్మరించినచో పుష్కర స్నాన ఫలము లభించును. మంకణాది తపస్సిద్ధులు కూడా సంతోషముతో పుష్కరమును సేవింతురు. పుష్కర స్నాతులు ఎచట వెళ్ళిననూ కామితార్థ సిద్ధిని పొందెదరు. పుష్కరనామమును పలికిననూ పుష్కర స్నానజన్య ఫలము లభించును. పుష్కరస్నాన మాహాత్మ్యమును వినిని వారుకూడా పుష్కర స్నాన ఫలము పొంది స్వర్గమున దేవతలవలె ఆనందించును.
ఇది శ్రీ బృహన్నారదీయ మహాపురాణమున
బృహదుపాఖ్యానమున ఉత్తర భాగమున
వసుమోహినీ సంవాదమున పుష్కర మాహాత్మ్యమను
డెబ్బది యొకటవ అధ్యాయము

Sri Naradapuranam-3    Chapters    Last Page